STORYMIRROR

Ram K

Romance Classics Others

4  

Ram K

Romance Classics Others

ప్రేయసి

ప్రేయసి

1 min
368

నీ కన్నులు కైపెక్కించాలి కానీకన్నీటి తెరల మాటున తడవకూడదు

నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ వుండాలి కానీ

ఎర్రమందారంలా ఎరుపెక్కకూడదు


నీ పెదవులు తమకంతో తడవాలి కానీ

ఆవేదనతో అధరాలు అదరకూడదు

నీ హృదయం ప్రేమామృతం చిందించాలి కానీ

పలు విధాలుగా చింతించకూడదు


నీ మాటలు మత్తెక్కించాలి కానీ

మథనపడుతూ వుండకూడదు

నీ స్వరం సంతోషాల సంగమం కావాలి కానీ

దుక్కసాగరం కాకూడదు


నీ కనులు నీ ముగ్ధమనోహర రూపం

నీ హృదయం నీ పలుకు సంతోషమైతే నాకు వెన్నెలే....

ఆ కనులు ఆ హృదయం ఆ పలుకు ఆవేదనలైతే అమావాస్యలే

శ్రీరామ్ కొడమర్తి 


Rate this content
Log in

Similar telugu poem from Romance