STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

3  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

💗ప్రేమవాగ్దానం!

💗ప్రేమవాగ్దానం!

1 min
272

నా ప్రాణ సఖునికి,

ఎన్నో చెప్పాలని మనసు ఆరాటపడుతుంది.. కనులు నిద్ర మరిచి నీ రాక కోసం ఎదురుచూస్తున్నాయి..

నా కనురెప్పలు కలంగా మార్చి ,

నా ఎదసవ్వడిని అక్షరాలుగా మార్చి ...

రాసిపంపుతున్న అనురాగ మాలిక ..

ప్రేమ సుమమాలిక ..ప్రణయ గీతిక..

నీ నుండి నేను కోరుకునే విలువైన బహుమతి.. 

నీ చిరునవ్వు.. నీ కంటి చూపు..

నీ కళ్లు నన్ను పలకరిస్తున్నట్టు..

నీ చిరునవ్వు నా హృదయాన్ని మీటుతున్నట్టు.. గొప్ప అనుభూతి కలుగుతుంది..

ఆ అనుభూతి నుండి జాలువారిన నా హృదయ స్పందన నీ మనసులో శిలాక్షర మాలికగా ...

శిథిల శిలా పలకంగా ...కలకాలం నిలిచిపోని ..

ప్రియా ..

ఎవరివో నువ్వు ..

కలవో ..

కల్పనవో..

కమ్మని భావమో..

మది భారమో..

నాలోని.. ఆశవో..

నా శ్వాసవో..

ఎవరివో..

కనులలో రూపమో.

మదిలోని గానమో..

హృదిలోని గాయమో..

ఎవరివో..

🌷🌷🌷🌷🌷🌷🌷

ప్రియా ..

నీ చేతిలో కలాన్ని నేనై

కమ్మని కవితగా లికించు కోవాలని..

నీ మనసులో ప్రియురాలు నేనై

ప్రేమ మందిరం నిర్మించాలని..

చల్లని పిల్లగాలినై నిన్ను అల్లుకుపోవాలని..

ఆలినై నీలో కలిసిపోవాలని..

నీ జీవితపు ప్రయాణంలో నీతో కలిసి నడుస్తూ అనుభవాలను ,

ఆనందాలను ,

విషాదాలను పంచుకోవాలని ...

నీ మదిలో.. హృదిలో ...

చెరగని స్మృతిగా నిలిచిపోవాలని ...

ప్రియా ,

కదిలిపోయే కాలం సాక్షిగా..

కరిగిపోయే కన్నీటి సాక్షిగా..

నిదురలేని రాత్రుల సాక్షిగా..

పలకలేని భావాల సాక్షిగా..

భారమైన హృదయం సాక్షిగా ..

దరి చేరని ప్రేమ సాక్షిగా ..

నిన్ను ప్రేమిస్తున్నాను...

నా కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను..

నా చివరి శ్వాస వరకు ప్రేమిస్తాను..

ప్రియా ఇదే నేను నీకు చేస్తున్న ప్రేమవాగ్దానం..

ఇట్లు ,

నీ నేనుగా ..

శ్రీ ..

హృదయ స్పందన .



Rate this content
Log in

Similar telugu poem from Romance