ప్రేమసమరం
ప్రేమసమరం
ప్రేమగీతను బోధపరచిన మన్మథుడితో కయ్యమెందుకు
శోకసంద్రములోన ముంచే నావికుడితో నెయ్యమెందుకు
వలపు నిండిన గుండె నీదని ఎన్నిమారులు చెప్పవలెనో
అడుగుపెట్టిన నాటినుంచే తిరిగి పోయే యోచనెందుకు
పగల సేనను తిరిగి పంపే వ్యూహములు నాకున్నవోయీ
ప్రేమసమరంలోన నిన్నే మించుతానని బెదరుటెందుకు
నిన్ను పిలిచే హృదయవేణువు దివారాత్రము చూడకున్నది
ఆలపించిన ప్రణయరాగము వేరొకరిదని అలుకలెందుకు
సాలులో ఏ మాసమైనా పూలఋతువే స్వాగతించును
శిశిరకాలం మనసులో నీకెదురుపడునని వె
ఱపులెందుకు
వేరుపరిచే వియోగానికి చితిని పేర్చిన ప్రేమికుడినే
కౌగిలింతల మధ్య కాలం తక్కువేనని తెలియదెందుకు
నీవు తొలగిన బతుకుపైనే విరహమేఘం కమ్ముతున్నది
తనకు తానే తిరిగిపోయే మార్గమేదో తెలుపవెందుకు
కాలమే పదునెక్కిపోయిన కత్తిలాగే మారుతున్నది
అంచుపై పరిగెత్తిపోయే వింతవిద్యను నేర్పవెందుకు
విషాదాలే బెంగటిల్లే కవితలెందుకు
నాకు నచ్చే సరసకావ్యం వొక్కటైనా రాయవెందు