ప్రేమంటే
ప్రేమంటే
నీకు నచ్చిన వాళ్లలో
నీకు నచ్చని విషయాలు
కూడా
నచ్చేసేయడమే
ప్రేమంటే!
లైఫ్ లో
కొత్తగా ఏమి జరగదు గాని
కొత్తదనం ఉంటుంది!
అద్భుతం గా ఏమి ఉండదు గాని
ఆహ్లాదంగా ఉంటుంది!
అందంగా లేని
అమ్మాయితో కూడా
ఐశ్వర్యా రాయ్ తో
ఉన్నంత ఆనందాన్నిస్తుంది!
డబ్బులేని
అబ్బాయితో కూడా
అంబానితో ఉన్నంత గొప్ప గా ని ఇస్తుంది!
అన్నిటికీ మించి
నీ దగ్గర ఏదీ లేని టైం లో కూడా
అన్నీ సాధించుకునే ధైర్యాన్ని ఇస్తుంది!

