ప్రేమంటే ఏమిటో తెలిసిందిలే
ప్రేమంటే ఏమిటో తెలిసిందిలే
ప్రేమంటే ఏమిటో తెలిసిందిలే,
మమతల పెన్నిధిగా మనసుకే మనసైందిలే,
జగాల పులకింత ప్రేమలో చూసేములే.
మనసు పూదోటలో కోయిలమ్మ వలపు తేనియరాగాలే పలికేనులే,
కవ్వించే కనుసైగల్లో
విశ్వప్రేమ తత్వమే దాగెనులే,
జోడు కోరేటి ఈడు
సిగ్గుకథలే చెప్పేనులే,
ఆశలే అనురాగమధువులై ఆనందం పంచునులే.
అనుబంధం పెనవేయాలంటే భార్యకు భర్త భర్తకు భార్య ఆరోప్రాణం అవ్వాలిలే,
పంతాలు పట్టింపులు
ప్రణయం చిందే
మురిపించు సొగసులు అయితేనే ముద్దుముచ్చటలే,
గాలితరగల ఊహల్లో
గిల్లికజ్జాలే వుంటాయిలే,
గుండె పొదరింట ప్రేమకు
ఆత్మీయతే
నూరేళ్ళ జీవశ్వాస అవుతుందిలే.

