STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama

2.9  

Ramesh Babu Kommineni

Drama

ప్రేమలేఖ

ప్రేమలేఖ

1 min
408


ప౹౹

అనుకోకుండా వచ్చింది వాడికో ఒక ప్రేమలేఖ

స్నేహితురాలే రాసింది అతనేమిటో తెలియక |2|


చ||

ఆజన్మ బ్రహ్మచారి మొదటనుంచి అసలే

మరో జన్మకు సరిపడ చాదస్తం తనకసలే|2|

మనసునంత ఎవరో బాగా కెలికిన వింత

ఆనక వళ్ళంతా చెప్పలేని ఏదో గిలిగింత|ప|


చ||

తనకి వచ్చిన లేఖని చెప్పాడు ఊరంతా

అంగట్లోని సరకులాగ ఊరించి మరింతా|2|

అనుభవం లేని ఒక సరికొత్త వ్యవహారం

అవసరం లేదని మొదలెట్టెను పరిహారం|ప|


చ||

కల్లూ తాగి కోతి ఎగిరి నిప్పు తొక్కినట్లు

పసివాడూ పాలకోసం గుక్కనే పట్టినట్లు

లేఖ రాసిన వారి మనసే ఏమి పట్టనట్లు

ఆగమే చేసాడు రాసిన వారినే కొట్టినట్లు|ప|



Rate this content
Log in

Similar telugu poem from Drama