ప్రేమిస్తున్నాను
ప్రేమిస్తున్నాను
ఏదో చెప్పాలనుంది కానీ..
నా మాటలు తడబడుతున్నాయెందుకో..
ఏదో రాయాలనినుంది కానీ..
నా రాతలకు పదాలు దొరకడం లేదేందుకో..
ఏదో తెలపాలనినుంది కానీ..
నా తలపుల్లో దాగింది నువ్వేనన్న మౌనమేలనో..
ఏదో కల కనాలనుంది కానీ..
నా కలలు కల్లలవుతాయనే భయమేలనో..
ఏదో కథలల్లాలనుంది కానీ..
నా కథలో రాకుమారుడుగా నిలుచునేది నువ్వేనేమో..
ఏదో కారణం మురిపెంగా కవ్విస్తుంది కానీ..
నా కవ్వింపుకి కారణం నీవేనేమో..
ఏదో తెలియని బాధ మదిలో కానీ..
నా కన్నీటిని ఒడిసిపట్టే చెయ్యి నీదేనేమో..
ప్రతిక్షణం...అనుక్షణం...నేను నడిచే బాటలో నా...నువ్వై ...కనిపిస్తున్నావు...
దీనికి కారణం ప్రేమైతే...
అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను...

