ప్రేమిస్తానని
ప్రేమిస్తానని
ప్రేమిస్తానని ముందుకువస్తె కాదనకోయి
పవిత్రమైనది ప్రేమనునీవు వద్దనకోయి
ఇచ్చిపుచ్చుకు ధోరణివుంటె మంచిదేకద
మదిలొస్ధానం ఇమ్మనడిగితె లేదనకోయి
ఇష్టమైనచొ ప్రేమించేది ఒకేమనసుని
బలవంతంగ ఒకరిప్రేమను ఇమ్మనకోయి
విశ్వజనీనతమైనప్రేమ స్వార్ధం లేదు
పంచాలంటె అసూయతోటి నీదనకోయి
మెచ్చానంటు నచ్చినప్రియుని తెచ్చిచూపితె
ప్రేమికునితో వివాహమంటె ఏమనకోయి

