ప్రేమికుల సముద్ర తీరం
ప్రేమికుల సముద్ర తీరం
పున్నమి వెన్నెల చల్లని రేయిలో
నెచ్చెలి చెంతన వెచ్చని హాయిలో
తీరపు తెన్నెల మెత్తని ఇసుకలో
తేలిన మనసుల ఊసులు ఎగసెలే
అంబుధి నందున అలనై చేరగా
నీదరి తాకగ నీవొడి కోరేను
అలవై వస్తువు తాకీ మరలేవు
యేగతి నీకూ ఆశ్రయ మిచ్చేను
వెన్నెల నేనై కురిసీ తడుపగా
నీమది నిండెద ఉండెద నీ తోడు
వెన్నెల మాయగ పోవద తెల్లా
యేమని నిన్నూ పొందను నాదిగా
మీతలి దండ్రుల సేవలు చేసేను
వారికి కూతురు మీకుగ ఆలినై
సేవలు చేసిన అతివకు బానిసై
సేవలు చేసెద ముదితకు మగడినై

