STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance

4  

ARJUNAIAH NARRA

Romance

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

1 min
392

నీతో ఏడడుగులు వేద్దామని ఎదురుచూసా

ఏడూ వసంతాలు వచ్చిపోయాయి

ఎదురు వచ్చిన వాల్లని అడిగి చూసా 

నీ జాడ ఏమైనా తెలుసేమోనని....

నీవు వస్తావని ఎదురుచూసా....

ఏడూ గ్రీష్మలతో వయసు 

ఆకుల రాలిపోతానన్నది.........


నీకై ఎదురు చూసి నా కళ్ళు

కలహారా ఎడారిగా మారింది

నా మనసు మంచు గడ్డలా కరిగింది

నా ఆలోచన అగ్నిలా జ్వాలిస్తున్నది

నా ఆశ మాత్రం మిణుగురుల మెరుస్తుంది


నీవు వస్తవని పలకరిస్తావని

నా మనసును పులకరిస్తావని

నా ఆశలను చిగురింపజేస్తావని

ఎదురుచూసా, కలలుగన్న


ఆ కలలో కలహారా ఎడారిలో 

పరిమళ బరితమైన పువ్వులు పూయించాను

ఆ కలలో గులాబీ బుగ్గల అంచులో 

మంచు బిందువుల సిగ్గును చూసాను

ఆ సిగ్గులలో నీ నవ్వుల మోమును ఉహించాను


పందారను మరిపించే నీ మాటలు

ఈ చెలికాడి చెవిలో చేరుతాయని

బంతిపూల బరువు కన్న తేలికయిన నీ సొగసులు

ఈ ఎదురు చూపుల వరుడి చేతికి చేరువవుతాయని

ప్రతి రోజు ముమ్మారు మురిపెంగా 

ముసి ముసి నవ్వుల జీవితం ప్రసాదించే 

నా అనురాగ దేవత!  

రా ప్రియతమ! వచ్చి హాత్త్తుకో, అల్లుకో, 

ఒదిగిపో, నాలో లీనమై, నా శ్వాసగా మారిపో!

మన ప్రేమ అంకురించిన ఈ రోజు సాక్షిగా

నీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!



Rate this content
Log in

Similar telugu poem from Romance