ప్రేమే ఒక ఆకర్షణ
ప్రేమే ఒక ఆకర్షణ


అందమే ఆనందం
అది ఆశల చదరంగం
అనుకోని వ్యామోహాల మకరందం
మకిలిపట్టిన మనసుల మోహం
లోపించేను ప్రేమానురాగం
పై పై చిరునవ్వుల మెరుగు
చేసెను ఒకరినొకరు మోసం
తెలియక చేశారు సహజీవనం
తీర్చుకున్నారు దేహాల తాపం
చల్లారింది ఒకరిపై ఒకరికి వ్యామోహం
చెలరేగాయి అనుమానం అనే పెను భూతం
సృష్టించెను ఇద్దరిమద్య కోపం
ముంచేను దుఃఖ సాగరం
అయ్యెను బ్రతుకు భారం
కోల్పోయినా ఆత్మాభిమానం
చివరికి చేయించెను ప్రాణత్యాగం