ప్రేమానుబంధం - 01.02.2020 kjk
ప్రేమానుబంధం - 01.02.2020 kjk
జనియించి నంతనే - మాతృప్రేమ
తదుపరి పితృ ప్రేమ - అనుబంధం
ఎదుగుతున్నకొలది - బంధు ప్రేమ
అభ్యసనంలో నెలకొన్న - గురు ప్రేమ
ఇందులోనే కలవు స్వచ్ఛమైన అనిర్వచనీయమైన మధురానుబంధాలు
కళాశాలలలొ ప్రేమలాంటి ఆకర్షణ -
రక్షణ చేసుకోలేక అగును అదియే వికర్షణ
మా భావజాలాలే - మాకు ముఖ్యం
పెద్దలు చెబితే - మేము వినేదేంది?
మేము చేసేదే - మేము ఆచరించేదే స్వచ్ఛం
ఇందులోనే కలవు అపవిత్రమైన అధోగతి కి మార్గ ద్వారస్వేచ్ఛ నిర్గుణ బంధాలు
జీవితంలో స్థిరత్వాన్ని కోరుకునే యువత -
ప్రవర్తనా నియమావళిని అనుసరించి వచ్చే నడత
వృత్తి- ప్రవృత్తులలో నిలద్రొ క్కుకోవడంలో విడత
సమయము పట్టు జీవన మధురిమల ఆస్వాదనలలో
ఇందులోనే కలవు సహకార - సహయోగ చవులూరించే జీవిత రసరమ్య రసగుళికలు