ప్రేమ
ప్రేమ
ప౹౹
కలిసి చేసిన చెలిమి కలలతోనే పండు
అలసిపోని మనసుకూ ఆశలు మెండు ౹2౹
చ౹౹
అపురూపమేను మదిలో దాగిన ప్రేమ
రేపుమాపును రెపరెపలాడునే ఆప్రేమ ౹2౹
రెండక్షరాలలో ఒద్దికతో ఒదిగినా ప్రేమ
రెండు క్షణాలలోనే కలిగేనులే ఆ ప్రేమ ౹ప౹
చ౹౹
కలహించినా కలయికతోను సాగేనులే
కలలో ఊహించిన కలతే తొలగించులే ౹2౹
కమ్మని కావ్యమై కళ్ళ ముందు నిలుచు
ఝమ్మని నాదమై వీనులతో ఆలకించు ౹ప౹
చ౹౹
యుగాలూ గడిచినా ఇలలోనే నిలిచేది
జగాలు సైతం జతగానే నిలిపి నిలిచేది ౹2౹
రెండు హృదయాలనూ ఒకటిగా చేసేది
దండులా నిలిచి ప్రేమేగ జంటగ ఉంచేది ౹ప౹