ప్రేమ
ప్రేమ
గతంలో గతుకులు ఉన్నా గమ్యం ముందుంటుంది..
ముళ్ళ బాటకు భయపడకుంటే పూలబాట నీదవుతుంది..
మిత్రులే కదా అని నీ ప్రేమను తెలుపకు పది మందికి..
తెర వెనక గేలి చేసే తెలియని శత్రువులుంటారు నీ వెంటే మరి..
మనసులోని ప్రేమని, కోట్ల కొలది ధనాన్ని దాచకు..
దహించివేస్తుంది తీయగా తెలియని విధంగా..
కోరుకున్న మనసుకు కోటి కానుకలు ఇచ్చినా వ్యర్థము..
కొండంత ప్రేమను కొంగున ముడి కడితేనే అర్థము..
కోటి ఆశలతో ఎదురుచూసే ప్రేమ పక్షిలా నీ కొసం...

