ప్రేమ
ప్రేమ
చెలి కురులను ముద్దాడే..గాలికెఱుక ప్రేమ..!
ప్రియ శ్వాసలు కాపాడే..గూటికెఱుక ప్రేమ..!
చీకటిలో తలుపుకొరకు..వెతుకులాట లేల..
వెలుగు చూపు కిరణమైన..దారికెరుక ప్రేమ..!
కాలుతున్న పెదవులపై..పొంగు రాగమేదొ..
విరహానికి ఆహుతయే..యేటికెరుక ప్రేమ..!
తిరుగాడే రామచిలుక..మౌనమైన వేళ..
అరమగ్గిన తియ్యగున్న..మావికెరుక ప్రేమ..!
జన్మలుగా జ్ఞాపకాల..వెల్లువతో గొడవ
అంటుకున్న అడవిచాటు..రాత్రికెరుక ప్రేమ..!

