ప్రేమ యొక్క
ప్రేమ యొక్క
బాధయొక్క కమ్మదనం..భగ్నహృదికి తెలుస్తుంది..!
ప్రేమయొక్క మాధుర్యం..సరసమతికి తెలుస్తుంది..!
అందుకోను ఏమున్నది..ఇవ్వడమే శుభయోగం..
మాటయొక్క చల్లదనం..మౌననిధికి తెలుస్తుంది..!
అక్షరాల పందిరిలో..చూపులతో కళ్యాణం..
చరితయొక్క గొప్పతనం..కాలగతికి తెలుస్తుంది..!
వెన్నుతట్టి నడుపు శక్తి..మూలమెంత మనోహరం..
ఆటయొక్క చక్కదనం..శ్వాసశృతికి తెలుస్తుంది..!
పూవులసలు త్రెంచనట్టి..చేతులకే మొక్కాలోయ్..
పూజయొక్క వైభోగం..ధ్యానవనికి తెలుస్తుంది..!

