ప్రేమ ప్రయాణం
ప్రేమ ప్రయాణం
ఒట్టేసి చెబుతున్నా
నా ఊసుల పొదరింట
నీవుగాక మరెవ్వరూ లేరని,
నను నడిపించే చైతన్యం
నీతీయని పలుకేనని,
కలతలకు తావులేని
ప్రేమ పూలతోటలోన
తోడునీడగా సాగేది మనమేనని,
సత్యమైన ప్రేమకు ఆశలేగానీ అపజయాలుండవని,
కామపు ముద్దుముచ్చట
పెళ్ళి తర్వాతేనని,
ఒట్టేసి చెబుతున్నా
వలపు తలపుల్లో నీవుగాక వెరెవ్వరూ వుండరని.
పరువపు సొగసు
మనసుమాయ చేయదని,
ప్రణయలోకంలో ప్రేమామమకారమే
మన సిరిసంపదలని,
జీవితపు కావ్యంలో ప్రతీపుట
మదినేలే
మనప్రేమే వుండునని,
ప్రేమవీణ పలుకు రాగాలకు
స్వరాలే మనమని,
ఒకరి గుండెలో ఒకరు
వీడని తోడుగా వుండిపోదామని,
ప్రేమ వివరించు శాస్త్రంగా
జగతిలో మనమే వుంటామని,
ఒట్టేసి చెబుతున్న
ఎవరేమన్నా ఏంచేసినా
అదరక బెదరక తోడునీడగా వుంటామని.
ఆనందపు నిధులను పంచేదే ప్రమాణమని,
కన్న కలలు నిజంచేసే
మూడుముళ్ళ పరమార్ధం గౌరవిస్తూ జీవితం సాగిద్దామని,
విరహాలు వల్లించుభాష
మనవద్ద లేదని,
ప్రేమసుధల నవవేదం
మనకోసమే పుట్టేనని,
ఒట్టేసి చెబుతున్న
అనుబంధపు లోగిలిలో
ఇద్దరి తలపు ఒకటేనని.
