STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రేమ ప్రయాణం

ప్రేమ ప్రయాణం

1 min
6

ఉంది ఈనాటి పున్నమి వెన్నెల...


మోహనకరంగా,


సమ్మోహనకరంగా.....


మత్తుగా,


గమ్మత్తుగా....


పాల కడలిలా,


నా ప్రేమతాపాల కడలిలా....


నీ వలపుల జల్లులా


నా సిగలో విరజాజుల జల్లులా....


ఈ వెన్నెల సముద్రంలో చేయాలి


నీతో ప్రేమ ప్రయాణం...


మన ప్రేమ నౌకను చుక్కల దీపాలతో అలంకరించు...


తెరచాపకు ఇంద్ర ధనుస్సు రంగులను అద్దు...




దారి చూపడానికి ఉండనే ఉంది జాబిలి....


ఇక మొదలెడదాం...


మన ప్రేమ ప్రయాణం ఈ వెన్నెల సముద్రంలో...


ముందుకు సాగిపోదాం....


మన ప్రేమ పున్నమి వెన్నెల సముద్రంలో....


Rate this content
Log in

Similar telugu poem from Romance