ప్రేమ (prompt 2)
ప్రేమ (prompt 2)


పువ్వు లాంటి అమ్మాయి కళ్ళబడింది
కుర్రకారు గుండెల్లో ప్రేమ మొలకెత్తింది
ఎవరెంతడిగినా అమ్మాయి కసిరికొట్టింది
కుర్రాళ్ళ జోరు, హుషారు బేజారయింది
కొత్తగా అబ్బాయి ఒకడు ఆఫీసు కొచ్చాడు
అమ్మాయితో మాట కలిపి స్నేహం చేశాడు
మెల్లగా ఆమెకు మనసులో మాట చెప్పాడు
తన హృదయమే ఆమెకు కానుక అన్నాడు
అమ్మాయి అతని మాటలకు కరిగి పోయింది
పెద్దవాళ్ళతో మాట్లాడమని తాను తప్పుకుంది
ఇరువైపు పెద్దల ఒప్పుదలతో పెళ్ళి కుదిరింది
తెలివైన అబ్బాయికి తాను జంట అయింది.