STORYMIRROR

Nannam Lokesh

Romance

4  

Nannam Lokesh

Romance

ప్రేమ పరిచయం

ప్రేమ పరిచయం

1 min
22.5K

నీ కళ్ళులోని కాంతి నా గుండె చీకటిని నింపెనె

నీ గుండెలోని వేగం నా కళ్ళకు మార్గం చూపెనె

నీ మనసుకు నా శరీరం పులకరించెనె

నా శరీరం నీ జీవితానికి బాట అయ్యెనె


ఎక్కడ చూసిన నీ మాటలు వినపడెనె

నీ మాటలు నాకు పుస్తకంగా మారెనె

నీ నడక నాకు బలమును ఇచ్చెనె

నీ బలము నాకు శక్తిని ఓసగెనె


ఓ ! నా అందాలతార దిగిరావె !

నీ సింహాసనం నా గుండెకు పీఠం అయ్యెనె

నా మందిరం నీకు స్వర్గంగా ఉండెనె

నా క్రియలు నీకు ప్రతి దినం పూజలు చేసెనె


ఓ ! నా స్వప్న సుందరీ లోకం నీదాయెనె

నీ వెంట నేను అనుసరింప విమోచింపవె

నీ మనసు నాకు అద్దంలా కనబడెనె

నన్ను నీవు ఎప్పుడు సొంతం చేసుకొనెదవె



Rate this content
Log in

Similar telugu poem from Romance