ప్రేమ లోన
ప్రేమ లోన
ప్రేమలోన పడిపోతే..త్యాగము కద మిగిలేది..!
సత్యమేదొ తెలిసిందా..జ్ఞానము కద మిగిలేది..!
పురాణాలొ చరిత్రలో..రుజువుచేసె విలువలను..
ఆచరణయె లేదంటే..పాఠము కద మిగిలేది..!
అసలుచెలిమి రహస్యమే..దాగున్నది కణకణమున..
అందుకునే సహనమున్న..శాంతము కద మిగిలేది..!
కలిమిలేము లేమున్నవి..ప్రాణాధిక మేమిటోయ్..
ఆలోచన బాగుపడిన..స్వర్గము కద మిగిలేది..!
ఆటపాటలెల్ల కలలు..సాక్షిలాగ మారితే..
గమనించే ప్రక్రియలో..సౌఖ్యము కద మిగిలేది..!

