STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రేమ కరుణ

ప్రేమ కరుణ

1 min
2


తినువారే తినబడుతూ..ఉంటారా తినుటచేత..! 

కలవారే కలబడుతూ..ఉంటారా కలలచేత..! 


దారి ఎవరు వేస్తారోయ్..మరి చేస్తూ వెళ్ళటమే.. 

అనువారే అనబడుతూ..ఉంటారా అనుటచేత..! 


అణ్వాయుధమస లెంతోయ్ ఒకమాటకు సమమౌనా..

విసురువారె విసరబడుతు..ఉంటారా విసురుటచేత..! 


ఆశలెన్ని రకాలైన..దురాక్రమణ ముందెంతట.. 

చంపువారె చంపబడుతు..ఉంటారా చంపుటచేత..! 


నాటకమున నాటకాలు..కాలమేమొ అపరసాక్షి.. 

చూచువారె చూడబడుతు..ఉంటారా చూచుటచేత..! 


ప్రేమ కరుణ చెలిమి ఇవే..అందమైన సంపదలే.. 

కాచువారె కాచబడుతు..ఉంటారా కాచుటచేత..! 




Rate this content
Log in

Similar telugu poem from Romance