STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ కొరకు ప్రేమలో

ప్రేమ కొరకు ప్రేమలో

1 min
1

ప్రేమంటే తెలియకనే..ప్రేమించుట మనసు కథ..! 

ప్రేమ కొరకు ప్రేమలోన..మరణించుట మనసు కథ..! 


చదువుకునే రోజులెంత..పవిత్రమో అపురూపమొ.. 

ప్రేమలోన మోసపోయి..విలపించుట మనసు కథ..! 


ఊరించే వయసుమెరుపు..ఊహల్లో మధువు నింపు..

ఆకర్షణ సూత్రమదే..మురిపించుట మనసు కథ..! 


మూలమెవరు చూస్తారట..తాత్కాలిక వేడుకలో.. 

బ్రతుకుతెరువు మాయేదో..మరపించుట మనసు కథ..!


అమాయకత వేగుతుంది..విరహంలో ఒంటరియై.. 

వెన్నంటిన ప్రియుడెవరో..నమ్మించుట మనసు కథ..! 


మత్తుమందు కాదు ప్రేమ..విశ్వమైత్రి వేదం కద.. 

అందముగా వేదించుట..బాధించుట మనసు కథ..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance