STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ కదా

ప్రేమ కదా

1 min
356

ముత్యమంటి చినుకువీణ ఆలాపన ప్రేమ కదా..!

చిన్ని గింజ గుండెదివ్వె ఆరాధన ప్రేమ కదా..!


పండ్లిచ్చే చెట్టు నీడ ఎంత హాయిగుంటుందో..!

చెప్పలేని తేనెలింటి ఆ భావన ప్రేమ కదా..!


ఆనందపు పరిమళాలు పంచుతున్న మనసెక్కడ..?!

కానరాని మౌనవేణు పరిలాలన ప్రేమ కదా..!


సరిగమలకు స'రసాలను నింపు హంస కలలెన్నో..!

అంతరంగ సురసీమన మది సాధన ప్రేమ కదా..!


కనుల దూకు చినుకులెల్ల మాల కట్టు పని ఏమిటొ..?!

మాయమయే మంచుపూల పరిశోధన ప్రేమ కదా..!



Rate this content
Log in

Similar telugu poem from Romance