ప్రేమ కాబోలు
ప్రేమ కాబోలు


ఆమె కన్నుల కాటుక చెదిరినది
ఆతని రాకకై వగచి కాబోలు
ఆమె యద బరువెక్కినది
అతని కౌగిలి పొందక కాబోలు
ఆమె జడ విసుగు చెందినది
అతని మీద కోపం కాబోలు
ఆమె జూకాలు సందడి చేయడం ఆపినవి
అతని జాడ తెలియదు కాబోలు
ఆమె జీవించడం ఆపినది
అతడిక తిరిగి రాడు కాబోలు
అతనంటే ఆమెకు ప్రేమ కాబోలు