ప్రాణ సఖీ
ప్రాణ సఖీ
అదేపనిగ చదువుకునే ప్రేమ లేఖనైతె చాలు..!
పరిమళించు అందమైన తీపి ఊహనైతె చాలు..!
నీ హృదయపు కోవెలలో వెలుగు దీపశిఖ ఏదో..
చూస్తు అలా తేలిపోవు..పక్షి పాటనైతె చాలు..!
విరహమధువు గ్రోలుతున్న తుమ్మెదలా ఎందుకిలా..?!
నీ వెలుగున ఆడుకునే..మబ్బు తునకనైతె చాలు..!
ఏ వాసన లేని పూలతీవలాగ బ్రతకటమా..!?
పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..!
మట్టిగుండె లయమాటున నిశ్చలమౌ ప్రాణసఖీ..
లాలనలకు అతీతమౌ..చెలిమి వీణనైతె చాలు..!

