పిల్లల పండుగ
పిల్లల పండుగ
----------------------
మమతల పండగ వచ్చెను.
సమతను ధరణికి తెచ్చెను.
విమల కమల నేస్తాలు
శ్రమలో కలిపెను హస్తాలు.
చేసిరి పిల్లలు మతాబులు
వాసిగ పొందిరి కితాబులు.
కేరింతలు కొట్టుచు నాడుచు
చేరంగ పిల్లలు పాడుచు
దిబ్బు దిబ్బు దీపావళి
అబ్బుర పరిచగ గృహావళి
తల్లులు మిఠాయి పెట్టిరి
పిల్లలు జేజేలు కొట్టిరి
విరిసిన పువ్వులు పిల్లలు
కురిసెను నవ్వుల జల్లులు
నవ్వుల పండగ దీపావళి
దివ్వెల పండగ దీపావళి/
--------------------------
