సాధుమార్గము
సాధుమార్గము
సాధుమార్గము
(వచన కవిత )
మోసముతో గెలుపొంది నీవు భోగములందుకొందువా?
కాసు కొఱకు నాశ పడుతూ నీవు కాలములో సాగెదవా?
వేదార్థసారమును కొంత విడమరచి తెలిసికొని పయనించు!
కాదంటూ పరిగెడితే తుదకడుసులో కాలుజారి పడిపోతావు!
మాయలూ మర్మాలనుచు మానవత్వమును మరచిపోకు!
మోయలేని భారముతో కుమిలి మూఢత్వంలో జీవించకు!
సత్యమనేదెప్పటికైనా జయిస్తుందని తెలుసుకొంటే మంచిది!
నిత్యమొక మంచి పనిని నిష్ఠగా చేయటమే మన కున్నవిధి.
సాధుమార్గమును చూపు సజ్జనులతో స్నేహమును చేయుమా!
బాధాతప్త జనాళికి బాసటగా నిలబడి కరమునందీయుమా!
జనము కొఱకు తపియిస్తే విజయము నీ వెను వెంట వస్తుంది!
ధనకనకముల కన్న దయాగుణమే నిన్ను చరితార్థుడిని చేస్తుంది!
