STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

అదిగో మా ఊరు

అదిగో మా ఊరు

1 min
1

అదిగో మా ఊరు 
(వచన కవిత )

అదిగో అదిగో మా ఊరు.
ఇదిగో ఇదిగో ఇటు చూడు!

 అచ్చమైన తెలుగు తనముతో.
ముచ్చట గొల్పే ముగ్గులతో.
అరుగులు కల్గిన గృహములతో.
సిరితల్లి నిలిచిన గడపలతో.

చల్లగ వీచే గాలులతో.
అల్లన కదిలే మబ్బులతో.
జిల్లను చెరువున జలములతో.
త్రుళ్ళుచు తిరిగే పుల్గులతో.

పాల నిచ్చెడి గోవులతో.
పాలించే గోపబాలురతో.
హలములు పట్టిన రైతులతో.
పొలములు దున్నే కోడెలతో.

బడికి వెళ్లే చిన్న పిల్లలతో.
గుడిలో మ్రోగే గంటలతో.
ఆటల నాడే కుర్రలతో
పాటలు పాడే పడుతులతో

ప్రాజ్ఞత కల్గిన పెద్దలతో
విజ్ఞత కల్గిన యువకులతో
సాధు సంతుల దీవెనలతో
ఆదరించే గ్రామ పౌరులతో

విలసిల్లే మా పల్లెటూరు.
కలిమితో సతత మలరారు.
సుఖ శాంతులతో మా ఊరు
వసుధకు నాదర్శమై తీరు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics