STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పిచ్చి కోరిక

పిచ్చి కోరిక

1 min
7


పిచ్చిచేష్టలకు రహదారి వేదికకాదోయి,
బ్రతుకులతో ఆటలాడుట తప్పోయి.

కసాయితనపు కోరికే 
వివేకమును చంపునోయి,
దరిచేరు మోహాలు ప్రేమాభిమానపు మాటలు వినవోయి,
కోడెకారు కొంటెతనం 
కుటుంబంలో చిచ్చు పెట్టొద్దోయి,
జీవన రహదారుల్లో 
బ్రతుకుబండి మమతలమార్గంలో నడిస్తేనే శుభమోయి.

పయనించే దారంతా 
తనువు తహతహలు 
తీర్చేదై వుండదోయి,
వింతచేష్టలు 
కన్నీళ్ళను మిగిలిస్తే 
జీవితం నైరాశ్యపు దారుల్లో పయనించునోయి,
దాంపత్యపు అనుబంధానికి విలువ యివ్వాలోయి 
సరదా కోరిక ప్రణయరాగం కాలేదోయి,
కవ్వించే అందాలు కాదు 
మనసందాన్ని చూసినపుడే 
గతుకులు లేని దారుల్లో 
బ్రతుకు బండి సాగునోయి.


Rate this content
Log in

Similar telugu poem from Classics