ఫేస్బుక్
ఫేస్బుక్
అనుబంధాలను చిగురింపచేసే అనువైన వేదిక
ఎక్కడెక్కడి మొక్కలను అంటుకట్టిన వనమాలి
అక్కడక్కడ నక్కిన చుక్కలను ఒక్క తాటిపై తెచ్చిన దళపతి
మస్తిష్కానికి విజ్ఞానపు విస్తీర్ణాన్ని ఆస్తిగా అందించు ముఖపుస్తకం
జీవితంలో జరిగే సంఘటనలన్నీ ఎవరికివారే ఆవిష్కరించుకునే స్వీయచరిత
విస్తుపోయే వింతలెన్నో విస్తరాకులో వడ్డించగల వస్తాదు
సుస్తికి స్వస్తిపలికే చిట్కాలెన్నో చూపే మంత్రసాని
అస్తవ్యస్తమైన వ్యవస్థ అవస్థలను కళ్ళముందు సాక్షాత్కరించే మంత్రదండం
చూస్తూ చూస్తూ విలువైన సమయాన్ని శిస్తుగా వసూలు చేసే రుస్తుం
పస్తులు పెట్టించి పుస్తెలు పుటుక్కుమనిపించుటలో పేరున్న హస్తవాసి