పెను ఉప్పెన
పెను ఉప్పెన
చినుకంటే పెనుఉప్పెన..మూలమనే తెలియలేదు..!
కనుపాపకు గుండెతోటి..బంధమనే తెలియలేదు..!
నా ప్రేమను మాటలలో..పెట్టలేను ఎప్పటికీ..
మనసు పిచ్చిదై మిగిలె..విరహమనే తెలియలేదు..!
నన్ను నేను మోసమెలా..చేసుకొంటినో ఏమో..
ఎదలోయల ఆవేదన..మోహమనే తెలియలేదు..!
నీకోసం ఎక్కడనో..వెతుకులాడు సంగతేమొ..
తపనపడే వేడుకయే..రాగమనే తెలియలేదు..!
గోడమీది చిత్రపటం..సడిసేయక నవ్వేనా..
వ్యాఖ్యానం ఏమైనా..వ్యర్థమనే తెలియలేదు..!
ఈ రెప్పల మౌనమెంత..మనోహరమొ ఏంచెప్పను..
నిదురపూల తోటసాక్షి..కావ్యమనే తెలియలేదు..!
