STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పడుతూ లేస్తూ ముందుకు వెళుతూ

పడుతూ లేస్తూ ముందుకు వెళుతూ

1 min
325

పరాకు నాకు అలవాటు

చిరాకు నా సర్దుబాటు

పొద్దున్నే లేవటం జరుగుబాటు

అన్నిటికీ ఆలోచించడం పొరపాటు


నేనూ నీలానే

బస్సులో చివరి సీటు వద్దని ముందుకు వెళతాను

కానీ రిజర్వేషన్ మాత్రం చేసుకోను

క్యూలో నిలబడడం ఇష్టం ఉండదు

అలా అని ముందుగా రాను


కొన్ని తప్పులు నాకు నేరాలుగా అనిపిస్తాయి

మరి కొన్ని నేరాలు అసలు తప్పులా కూడా అనిపించవు

సగటు మనిషిని నేను అని సోది చెప్పను

అలా అని స్వగతం ఇతరుల మీద రుద్దకుండా ఉండలేను


ఎందుకా

ఏమో

అదే కదా ట్రెండు

మన ఆలోచనల్ని మనం గౌరవించుకోవడం మానేసి చాలా రోజులయింది

ఆ విషయం తెలిసినా తెలీనట్టు 

పడుతూ లేస్తూ ముందుకు వెళుతూ ఇలా నీకు కనిపించాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract