పద పద పదా...
పద పద పదా...
పద పద పదా...
మలినపు మన"షు"సులకు ముసుగేస్తూ,
మూఢనమ్మకపు ముడుపులకు మొక్కుచెల్లిస్తూ,
కర్కశపు కట్టుబాట్లను కట్టిపెడుతూ,
అతిశయపు ఆచారాలకు అడ్డుపడుతూ,
పద పద పదా...
తరుముతున్న తలరాతను తుడిచేస్తూ,
విసురుతున్న విమర్శలను విస్మరిస్తూ ,
విరబూసిన వెన్నెలను వెతుక్కుంటూ,
ఆశయపు అంచులను అందుకుంటూ,
పద పద పదా...
అలుముకున్న ఆకలిని అణిచివేస్తూ,
కమ్ముకున్న కోరికలను కాలరాస్తూ,
గతితప్పిన గమ్యాన్ని గాడినపెడుతూ,
నివురుగప్పిన నడిరేయిలో నిర్భయంగా,
పద పద పదా...
పద పద పదా...
ఇది కద మన కథ
✍️సత్య పవన్✍️
