STORYMIRROR

Midhun babu

Crime Fantasy Children

4  

Midhun babu

Crime Fantasy Children

ఓనరుడా

ఓనరుడా

1 min
5

అడవులన్నీ తిరిగినా ఆత్మ దొరకదురా
అంతరంగం శుద్ధైతే పరబ్రహ్మమే వెలుగురా
అడవిలోనే సిద్ధులుంటే అడవే ముక్తి కాదురా
అందులోన పశు పక్షులకు ఆ భావన సాధ్యమే లేదురా
గురువు చూపు జ్ఞానదీపం గుండెలో వెలిగేనురా
అజ్ఞానాంధకారమంతా క్షణములో కరిగెనురా
ఆకాశమున ఎగిరినంతనే అమృతము అందదురా
అంతరంగము నిర్మలమైతే అమృతమే నే పొంగురా
తీర్థయాత్ర చేసినంతనే తీర్పు మారదురా
తన మనసును గెలిచినవాడే హరియౌనయ్యా
శరీర శుద్ధి మొదలైతే మనసు శుద్ధి పుడునురా
మనసు శుద్ధి కలిగినప్పుడే మౌన సమాధి కలుగునురా
సమాధిలోని నిశ్శబ్దమే సత్యస్వరము వినిపించురా
ఆత్మయే పరమాత్మని నీ అనుభవమే తెలుపురా

కాశీ గయలు చేరినంతనే కైవల్యము రాదురా
కలుషములన్నీ విడిచినవాడే కరుణ పొందురా
వినరా ఓ మానవుడా నీలోని దైవమును నీవే దర్శించుమురా


Rate this content
Log in

Similar telugu poem from Crime