నాన్నంటే
నాన్నంటే
అనుక్షణం తపస్సులో..ఉండువాడె నాన్నంటే..!
కుటుంబాన్ని కడు చెలిమితొ..నడుపువాడె నాన్నంటే..!
విసుగెరుగని బాటసారి..అలసటసలు తానెరుగడు..
చిరునవ్వుల కోవెలంటి..మనసువాడె నాన్నంటే..!
తనపిల్లల ఎదుగుదలకు..అంకితమై నిలచు తాను..
వారికొరకు స్వర్గాలను..నిలుపువాడె నాన్నంటే..!
తన బాధను తెలియనీక..భరియించును మౌనముగా..
సుఖదుఃఖా లన్ని సమము..తలచువాడె నాన్నంటే..!
తన ధర్మము పాటిస్తూ..లోకక్షేమ మాశించును..
ఏ కాలంలోనైనా..వెలుగు వాడె నాన్నంటే..!
