నాలో నేను
నాలో నేను
చిరుగాలులు చిరుసవ్వడి చేసే వేళ
చిరునగవుల మోముతో
వయ్యారంగా తలలూపుకుంటూ
హొయలొలికించే నీ దరికి .....నే చేరగానే......
వంపులు తిరిగిన నీ
లలిత లావణ్య లతలు
నా తనువును అల్లుకోవాలని
సుతిమెత్తగా నను తాకుతుంటే
నీ లేలేత సుకుమార లతాస్పర్శకి
నా మేను చక్కలిగింతల తన్మయత్వంలో
తడిసి మైమరచిపోయే పోయేవేళ ......
అందరికీ నువ్వు ధనలతవేమో ( money plant )
నాకు మాత్రం నాలో జనించే భావ కవితా శిశువుకు
ఊపిరి పోసే ప్రాణలతవి......అనుకుంటుంటాను
మురిసి పోతూ నాలో.... నేను !
.

