STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ సఖీ

ఓ సఖీ

1 min
2


చూపలేని తహతహనిక..దాచనెలా ఓ సఖా..! 
హృదిగెలిచిన నీరూపం..గీయనెలా ఓ సఖా..! 

చిన్నిబిందువైన నీవె..మహా సింధువైన నీవె.. 
నీ నర్తన మాధురినే..వ్రాయనెలా ఓ సఖా..! 

నిను చూచిన తొలిక్షణమే..ప్రేమంటే తెలిసెలే.. 
గుండెగొంతులోని మాట..పాడనెలా ఓ సఖా..! 

అక్షరాలు వర్షించే..నీ మౌనమె తోడుగా.. 
పద్యానికి ప్రాణమాయె..చూపనెలా ఓ సఖా..! 

విషయవీణ మీటుతున్న..విశేషమే చిత్రమే.. 
అంతరంగ నాదాలను..పలుకనెలా ఓ సఖా..! 

ఊపిరాపి నడిపించే..వినోదాగ్ని కేంద్రమా.. 
నాదైనది ఇంకేమిటి..ఇవ్వనెలా ఓ సఖా..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics