ఓ సఖా!
ఓ సఖా!
కన్నుల బాష్పముల్ తిరిగె గాంచవు నావ్యధ దీననైతిరా!
నన్నిటు బాధ పెట్టుటది
న్యాయము కాదని తల్చవేలనో
వెన్నెల రాత్రులన్ గడుప వేదన నొందుచు తల్చుకొంటిరా
నిన్నును నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్నునిన్నునున్ /

