STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ఓ పావురమా

ఓ పావురమా

1 min
6

నా మదినే తెలుసుకున్న.. ఓ చక్కని పావురమా..!

చెలుని జాడ తెలుపుచున్న.. ఓ చక్కని పావురమా..!


మధుర మధుర ప్రేమ కథకు రాయబారివైనావా..!

స్నేహ సుధలు ఒలుకుచున్న..ఓ చక్కని పావురమా..!


మనసులోని మమకారము..ఉత్తరాన నింపుటేల..?!

చిలిపితనము దాచుకున్న..ఓ చక్కని పావురమా..!


పూస గుచ్చి ఇస్తున్నా..ఎదలోపలి ఆవేదన..!

అణువణువును మీటుచున్న..ఓ చక్కని పావురమా..!


వరదలైన విరహ మధువు..అందించవె ఈ లేఖగ..!

అరచేతను వాలియున్న..ఓ చక్కని పావురమా..


Rate this content
Log in

Similar telugu poem from Romance