ఓ పావురామా
ఓ పావురామా
ఈ లేఖను నా చెలియకు..ఇచ్చిరావె పావురమా..!
తనమనస్సు భారమింత..దించిరావె పావురమా..!
ఎంత దిగులు పెట్టుకుందొ ఎలా ఉందో ఏమిటో..
తనను కాస్త ఊరడించి..తిరిగిరావె పావురమా..!
తనతలపుల కోకిలమై..పాడుతోంది నా హృదయం..
వినపడెనా అసలు తనకు..అడిగిరావె పావురమా..!
జతకోసం తపియించే..నా మనసే తన కోవెల..
నా ఊపిరి తాడుతోడు..చూసిరావె పావురమా..!
చెలి అందెల సవ్వడివిని..ఎంత కాలమయ్యిందో..
ఒక్కసారి ఇటు రమ్మని..తెలిపిరావె పావురమా..!
తన అలుకకు కారణమే..తెలుసుకునే శక్తిలేదు..
నా మాటగ తనచెవిలో..చెప్పిరావె పావురమా..!

