ఓ నృత్యం..
ఓ నృత్యం..


ఓ సందర్భం
ఓ అవకాశం
ఓ అద్భుతం
ఆమె నృత్యం
ఓ సంప్రదాయం
డోలు వాద్యానికి అనుగుణంగా
ఆడే కొత్త ప్రయోగం
కాలి అందియల చప్పుళ్ళు
కంటి చూపుతో కలవని కదలికలు
ఓ పోటీ
ఓ సభ
ఓ నిర్ణయం
ఓ జీవితం
ఆమె నృత్యం
వినోద ప్రధానంగా సాగొచ్చు
అంతర్లీనంగా అందులో ఏదో దాగుంది
చప్పట్లను దాటి నడిచే అడుగులు అవి
బహుశా
అదే ఏదో ఆమెను బయటికి తెచ్చింది
పంజరంలోంచి
మన చూపుల్లోంచి
అభిప్రాయాల వలయంలోంచి..