ఓ మోసం
ఓ మోసం
దేహాన్ని బాధిస్తుంది.
గుండె లోతుల్లో నరకయాతన అనుభవిస్తుంది.
మనస్సు ముక్కలు గా విరిగిపోతుంది.
ఆలోచనల్లో ముంచేస్తుంది.
ఒక్కోసారి చావు ను చూసినట్లు అనిపిస్తుంది.
మోసం చేసే వారికి ఏం తెలుసు మనిషి మనసు విలువ.
దారి తప్పిన జీవితం చేస్తారు.
ఎవర్ని నమ్మకుండా అయిపోతుంది.
పక్కనే ఉంటూ కోలుకొని దెబ్బకొడతారు.
గుండెకుగాయం చేసి నొప్పిని
ఊపిరి ఉన్నంతవరకు భరించేలా చేస్తారు.
మంచి చేస్తే మోసం విలువ రుచి చూపిస్తారు.
ఈ కలికాలంలో ఎవరిని నమ్మలో తెలియదు.
ఎవరు మనవారో ఎవరు పరాయి వారో
అర్థం కాదు.
మన పక్కనే ఉంటూ మనకి మోసం చేసేదాకా
తెలియరాదు మనకి..
ఈ కలికాలంలో నమ్మకు ఎవరిని గుడ్డిగా..
