ఓ మనిషి
ఓ మనిషి
ఓ మనిషీ
నిరాశా మేఘాల్ని దాటుకురా..
చెప్పుడు మాటల్ని వినకురా
నమ్మక ద్రోహాన్ని కనిపెట్టరా
ఓమనిషీ
స్వార్ధాన్ని కొంచెమే పొందరా
మానవత్వాన్ని వీడకురా
తడిమే బాధల్ని ఓర్చుకురా
ఓ మనిషీ
సంకల్పాన్ని నిలబెట్టుకురా
బంధాలను కాపాడుకురా.
బాధ్యతలను విస్మరించకురా.
ఓ మనిషీ.
మనుషుల్ని సంపాదించుకోరా
జీవితానికి అర్ధం తెలుసుకోరా
గతాన్ని దాటి భావి కొరకు పరిగెత్తరా !!!
.. సిరి ✍️❤️
