ఓ మేఘమాలా
ఓ మేఘమాలా
ఓ మేఘమాలా.........
గగనాన చారుశీలా.........
మెరుపంటి జిలుగులేల ఉరిమే వేళలా.........
మిలమిలా మెరిసేలా తనువున వర్ణాలా.........
జలజల కురిసేవేళ కారు మబ్బులా.........
ఆవిరి నీ లీలా.........
తెలుసులే జవరాలా..........
విభిన్నాకృతుల కొలువైనావెలా...........
చిరుగాలితోని స్నేహమే ఎంతలా..........
కరిగించే నీ మేను స్వాతి చినుకులా..........
మరిగింది నీ మనసు ఎల్లవేళలా...........
చెదిరింది నింగంతా ఆక్రమించేలా............
మారింది నీవల్ల నీలాల అంబరాలా............
తెల్లని పూలు పరచిన పూబాటలా............
నచ్చింది హరివిల్లు నీ మేని చిరుజల్లులా...........
పుడమి కంటికి విందై నీరెండ వేళలా..........
రేరాజుకి దుప్పటిలా సూరీడుకి తెరలా...........
ఎంత మురిశావే మేఘమాలా............

