STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ లేఖ ముద్దుగా

ఓ లేఖ ముద్దుగా

1 min
335

వ్రాశాను జాబిలికి..ఓ లేఖ ముద్దుగా..! 

పలుకకే వచ్చింది..కలలోకి తోడుగా..! 


తనతీపి స్పర్శతో..స్పృహలెల్ల మాయమే.. 

నిజచెలిమి వెన్నెలను..కురిసింది మధువుగా..! 


చిరుగాలి తరగల్లొ..దాచింది తనవలపు.. 

నా తలను నిమరగా..చేరింది పదముగా..! 


ఎవరేమి చెప్పినా..వినదాయె ఈ మనసు.. 

తనప్రేమ సాక్షిగా..దక్కింది ధనముగా..! 


కాలాన్ని నిలిపేయు..విద్యతో పనిలేదు.. 

పెనువిరహ తాపమే..చూడగా వరముగా..! 


గణయతిప్రాసలకు..లొంగదీ భోగమే.. 

అక్షరం వెన్నులో..మౌనమే తరువుగా..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance