ఓ కప్పు కాఫీ
ఓ కప్పు కాఫీ
చిక్కటి పాలకు
దిష్టి తగలకుండా
కాస్త నీళ్లను కలిపి
ఆ పాలు మరుగుతుండగా
కాఫీ పొడి కలిపి
ఆ కాఫీ పొడి పాలతో కలవాలని అటూ ఇటూ పరిగెడుతూ
చక్కెర వేసి
అది కరిగేంత వరకూ
ఎదురు చూస్తుంటే
ఆనక
పూల సువాసనను మైమరపించే పరిమళం
నీ చేతి కాఫీ కప్పులోంచి వస్తోంది
నా మొదటి కాఫీ నీళ్ళ ప్రహసనం
లిఖించుకుంటూ ఆస్వాదిస్తోంది..
