ఓ చెలియా
ఓ చెలియా
నా ఊహల్లో విహరించే జాబిలివై ..!!
సున్నితంగా నన్ను తాకే స్పర్శవై...!!
నా కనుల లో దాగిన కంటిపాపవై..!!
నేను తలచే తలపువై..!!
నేను కలవరించే కల వై..!!
నా హృదయ సామ్రాజ్యపు మహారాణి వై..!!
నిశీధిలో కాంతి పంచె జాబిలివై..!!
నా మదిలో మెదిలే ఆనందానివై..!!
నా గాత్రం లో ఉద్బవించె మృదు
స్వరానివై...!!
నా హృదయం లో ధ్వనించే ప్రేమ పల్లవివై..!!
నా మది తలపులలో మెదిలే ఓ
అందాల నా ప్రియ సఖి .!!
నువ్వే నా జీవిత గమనపు
మార్గ దర్శి...!!!!!

