ఒంటరి పోరాటం
ఒంటరి పోరాటం
జీవితంలో కొన్ని సంఘటనలు కల అని
తెలియడానికి తెల్లారక్కరలేదు
నువ్వు కళ్ళు తెరువు చాలు
నాది నాది అని నువ్వు ఎంత పాకులాడినా
అది నీది కాదు
స్వార్ధపూరితమైన ఈ లోకంలో
అంతా స్వార్ధమే
సొంతవాళ్ళే నీ గురించి ఆలోచించని రోజులివి
ఎవ్వరూ కాదు నీ స్వంతం
నీకు నువ్వు మాత్రమే శాశ్వతం
గుర్తుంచుకో గుర్తుంచుకో
ఒంటరి పోరాటం
గెలుపు కోసమో లేక గమ్యం కోసమో
పయనించాల్సింది నువ్వే
కాలం చేసే పని కేవలం నీకు
వెలుగు చూపించటం మాత్రమే
అడుగులు తడబడినా
అడ్డంకులు ఎదురైనా
చీకటి సర్పాలు నీకోసం కాపు కాసినా
మృత్యువే నీకోసం దారి కాచినా
పయనించాల్సింది నువ్వే
వేరెవ్వరూ లేరు ఉన్నా నీతో రారు..
... సిరి ✍️❤️

