ఒకలేఖగ
ఒకలేఖగ
చెలియకెంత తపనోమరి..ఒకలేఖగ..కావాలని..!
మల్లెకెంత మనసోమరి..తనసిగలో..విరియాలని..!
నీలికురుల మంతనాలు..నుదుటికెంత ఇంపోమరి..
గాలికెంత జోరోమరి..తన కబురులు చెప్పాలని..!
ఏ వెన్నెల పరిమళమో..తన పాటగ మారిందా..
రేరాణిగ అలరిస్తూ..తన వీనుల మ్రోగాలని..!
తన చూపే నవశిరీష..హంసతూలికా తల్పమ..
సరసవీణ రాగడోల..గీతమేదొ పంచాలని..!
కొమ్మమీది పాలపిట్ట..ఎదురుచూపు భావమేమొ..
కొసరికొసరి చెలి పాపిట..సింధూరము దిద్దాలని..!

